మృతదేహాల తరలింపు: 48 గంటల నోటీస్ హాస్యాస్పదం
- July 11, 2017
కాలికట్ ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జలాలుద్దీన్, మృతదేహాల్ని తరలించేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు 48 గంటలు ముందుగా సమాచారం ఇవ్వాలంటూ జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదమయ్యింది. ఇది సాధ్యం కాని విషయంగా ఇండియన్ ఎంబసీ మరియు సోషల్ యాక్టివిస్టులు పేర్కొంటున్నారు. గల్ఫ్ దేశాల నుంచి మృతదేహాల్ని స్వదేశానికి తరలించే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయనీ, వీటికి తోడు కొత్తగా ఈ 48 గంటల నోటీసు సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని వారంటున్నారు. అయితే జారీ చేసిన సర్క్యులర్ వెనుక ఉద్దేశ్యం వేరే ఉందనీ, దేశంలోకి ఇన్‌ఫెక్చువస్ డిసీజెస్ రాకుండా ఉండేందుకే తప్ప, మృతదేహాల్ని అడ్డుకునే ఆలోచన లేదని డాక్టర్ జలాలుద్దీన్ చెప్పారు. ఇంకో వైపున కేరళ ముఖ్యమంత్రి కూడా కేంద్రానికి ఈ విషయమై ప్రత్యేక విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి జలాలుద్దీన్ పంపిన సర్క్యులర్ ఒక్క షార్జా ఎయిర్‌పోర్ట్‌కి మాత్రమే చేరింది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







