మేథీ న గోట
- July 11, 2017
కావలసినవి: శెనగపిండి - ఒక కప్పు, మెంతి ఆకుల తరుగు - అర కప్పు, నల్లమిరియాలు - పది, ధనియాలు - ఒక టీస్పూన్, వాము - అర టీ స్పూన్, పచ్చి మిర్చి - నాలుగు (సన్నగా తరిగి), నూనె - ఒక టేబుల్ స్పూన్(వేగించడానికి సరిపడా కూడా నూనె తీసుకోవాలి), పంచదార - ఒక టీస్పూన్, ఇంగువ- పావు టీస్పూన్, బేకింగ్ సోడా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - సరిపడా.
తయారుచేయు విధానం : ఒక గిన్నెలో నీళ్లు, టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత అందులో వాము, పచ్చి మిర్చి, బేకింగ్ సోడా, ఉప్పు, పంచదార, ఇంగువ వేయాలి. మిరియాలు, ధనియాలు కచ్చాపచ్చాగా చేసి వేయాలి. తరువాత మెంతి ఆకులు, శెనగపిండి వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేయాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసి నూనెలో వేగించాలి. గ్రీన్‌చట్నీ లేకపోయినా వీటిని పచ్చి ఉల్లిపాయముక్కలు, వేగించిన పచ్చిమిర్చిలతో కలిపి తింటే రుచికరంగా ఉంటాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







