భారతీయ కాన్సుల్ జనరల్‌ను కలిసిన తెలుగు ప్రవాసీ
- July 11, 2017
దుబాయ్: దుబాయ్ లో నూతన భారతీయ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన విపుల్‌ను వివిధ ప్రవాసీ సంఘాల వారు మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ తమ సమస్యలను ప్రవాసులు ఆయనకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఇండియన్ పీపుల్స్ ఫోరం అనే ప్రవాస భారతీయుల స్వచ్చంధ సంస్ధ ప్రతినిధులు కాన్సుల్ జనరల్‌ను కలిశారు.
దుబాయ్, షార్జా నగరాల్లో తెలంగాణ ప్రవాసులు ఎదుర్కోంటున్న సమస్యలను వివరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయవల్సిందిగా విపుల్‌ను కోరినట్లు సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన శ్రీనివాస్ షార్జాలో పని చేస్తూ కష్టాల్లో ఉన్న ప్రవాసులకు చేతనైన సాయం చేస్తూ, ప్రమాదవశాత్తూ ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు విశేష కృషి చేస్తుంటారు. కాన్సుల్ జనరల్‌ను కలిసిన వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఉండగా అందులో తెలంగాణ నుండి శ్రీనివాస్, పందిళ్ళ మహెందర్ ఉన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







