కువైట్ చేరుకున్న 'APNRT' ప్రెసిడెంట్ డా.రవి కుమార్ వేమూరు
- July 12, 2017
కువైట్: APNRT అనగా ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు. ఇది AP ప్రభుత్వం లోని ఒక సొసైటి. దీనిని విదేశాలలో ఉంటున్న ప్రతి AP తెలుగు వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఒక సొసైటి (సంస్థ). విదేశాలలో ఉంటున్న ప్రతి తెలుగు వారు విధి గా ఈ సంస్థ లో సభ్యత్వం నమోదు చేసుకుంటే వారికి ఒక ID నెంబరు వస్తుంది. ఈ నెంబరు ఆధారం గా ఆపదల్లో ఉన్న వారికీ APNRT తగిన రీతిలో సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది.
ఈ విషయం పై అవగాహన కల్పించడానికి దీని ప్రెసిడెంట్ డా.రవి వేమూరు కువైట్ కు ఈ రోజు ఉదయం 5 గంటలకు వచ్చారు. వీరు నేడు మరియు రేపు అనగా 14 న కువైట్ లో విస్తృతం గా తెలుగు వారిని కలుస్తారు. ఈ సందర్భం గా రవి గారు మరియు కువైట్ లో కో-ఆర్డినేటర్స్ గా నియమించ బడ్డ 27 మంది కో అర్దినేటర్స్, కువైట్ లోని వివిధ ప్రాంతాలలో పర్యటించి తెలుగు వారి కి అవగాహనా సదస్సులు నిర్వహిస్తారు. ఈ అవగాహనా సదస్సుల్లో AP ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న గల్ఫ్ ప్రవాసిల పాలసి పై అవగాహన దాని మూలం గా ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్న వారికీ ఎవిదం గా ప్రభుత్వం తోడ్పాటునిస్తుంది అనే విషయమై వివరణలు ఉంటాయి.
సందర్సన వివరాలు:
నేటి అనగా 13 వ తేది పర్యటన వివరాలు:
ఎంబసీ పర్యటన... అంబాసిడర్ గారి తో చర్చలు...
ఫర్వానియ మరియు ఖైతాన్ లోని కొన్ని రెసిడెన్స్ అపార్ట్ మెంట్స్ సందర్శన
ఒక కంపెని క్యాంపు పర్యటన
కో అర్దినేటర్స్ కు అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమం.
14 వ తారీకు: వివిధ ప్రాంతాల లో అవగాహనా సదస్సులు మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు.
సందర్సించు ప్రాంతాలు: అభు హలిఫా, ఖైతాన్ పార్క్, ఒమారియ పార్క్, కడప మసీదు, మాలియా లోని చెర్చిలు, ఫర్వానియ మరియు ఖైతాన్ లోని కొన్ని రెసిడెన్స్ అపార్ట్ మెంట్స్...
కడప మసీదు లో 12-30 నుండి 1-30 వరకు.
ఖైతాన్ పార్క్, ఒమారియ పార్క్ లలో సాయంత్రం 3 గంటల నుండి సాయంత్రం 5-30 వరకు...
మాలియా లోని చెర్చిలు సాయంత్రం 6 నుండి 8 వరకు...
ఈ సందర్భం గా కువైట్ లో ఉన్న తెలుగు వారికి, మరియు వివిధ సంఘల వారు ఈ ప్రాంతాలలో మీ మీ సభ్యులతో తప్పక హాజరు కావాల్సింది గా APNRT కో అర్దినేటర్స్ తరుపున ప్రార్ధన. కువైట్ పర్యటన ముగించుకుని శనివారం ఉదయం దుబాయ్ చేరుకుంటారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







