క్యాబ్‌ డ్రైవర్స్‌ కోసం క్లినిక్‌

- July 14, 2017 , by Maagulf
క్యాబ్‌ డ్రైవర్స్‌ కోసం క్లినిక్‌

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) - దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌ (డిటిసి), ముహైస్నాలోని హెడ్‌ క్వార్టర్స్‌లో మెడికల్‌ క్లినిక్‌ని లైఫ్‌లైన్‌ కంపెనీతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎమిరేట్‌లోని క్యాబ్‌ డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వ క్లినిక్‌ ఇది. మెడికల్‌ అడ్వైజ్‌, అలాగే ప్రివెంటివ్‌ మెడికల్‌ కేర్‌ని ఈ క్లినిక్‌ అందిస్తుంది. దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌ సిఇఓ డాక్టర్‌ యూసెఫ్‌ మొహమ్మద్‌ అల్‌ అలి మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభించిన క్లినిక్‌ ద్వారా డ్రైవర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడ్తుందని అన్నారు. క్యాబ్‌ డ్రైవర్లు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారనీ, వారికి ఇలాంటి వైద్య సేవ అందించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా డ్రైవింగ్‌ సేఫ్‌గా చేయగలుగుతారని, తద్వారా రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని తెలిపారాయన. జనరల్‌ మెడిసిన్‌, ఆర్తోపెడిక్స్‌, ఆప్తల్మాలజీ, పల్మనరీ మరియు కార్డియాక్‌ డిసీజెస్‌, హైపర్‌టెన్షన్‌, ఒబెసిటీ వంటివాటికి సంబంధించిన నిపుణులూ ఈ క్లినిక్‌లో అందుబాటులో ఉంటారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ క్లినిక్‌ తెరిచి ఉంటుంది. ఫార్మసీని కూడా దీనికి అనుబంధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com