23న పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వీడ్కోలు

- July 14, 2017 , by Maagulf
23న పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వీడ్కోలు

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఎంపీలు ఈ నెల 23న సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలకనున్నారు. ఇందుకోసం పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేయనున్నారు. అందులో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రణబ్‌కు ఓ జ్ఞాపికతోపాటు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా సంతకం చేసిన పుస్తకాన్ని బహూకరిస్తారు. అనంతరం సెంట్రల్‌హాల్‌ ఆవరణలో తన గౌరవార్థం ఏర్పాటుచేయనున్న తేనీటి విందులో ప్రణబ్‌ పాల్గొంటారని సమాచారం. రాష్ట్రపతిగా ప్రణబ్‌ పదవీకాలం ఈ నెల 25తో ముగియనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com