సౌదీలో తెలంగాణకు చెందిన వలస కూలీ మృతి
- July 14, 2017
జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. మహ బూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం పోలేపల్లి పల్లెగడ్డకు చెందిన మల్లయ్య(35) జీవనోపాధి కోసం 2014లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. మల్లయ్య మృతి చెందాడంటూ తోటి కూలీలు గురువారం ఫోన్ చేసి ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు.
అయితే, పూర్తి సమా చారం తెలుసుకునేందుకు ఆరా తీయగా మొదట ఫోన్ చేసిన కూలీలు మళ్లీ అందు బాటులోకి రాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోవడంతో శుక్రవా రం కలెక్టర్ రొనాల్డ్‌రాస్‌ను కలసి తమ పరిస్థితి వివరించారు. ఎంపీ జితేందర్ రెడ్డికి ఫోన్‌లో సమాచారం ఇవ్వగా ప్రభుత్వం తరఫున∙విదేశాంగ మంత్రితో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







