అమెరికా హోనలూలులోని భారీ అగ్నిప్రమాదం
- July 15, 2017
అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హవాయి రాష్ట్ర రాజధాని హోనలూలులోని 31 అంతస్తుల అపార్టుమెంట్లో జరిగిన ఆ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మార్కోపోలో అపార్టుమెంట్లో 26వ అంతస్తులో మొదట మంటలు చెలరేగాయి. ఇవి 27వ అంతస్తుకు ఎగబాకాయి. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
అపార్టుమెంట్లో 586 ఫ్లాట్లు, నాలుగు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. గాయపడిన వారికి పారామెడికల్ సిబ్బంది చికిత్సలు అందించారు. గాయపడిన వారిలో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి నిలకడగా ఉందని అగ్నిమాపక శాఖ అధికారి కెప్టెన్ డేవిడ్ జెన్కిన్స్ తెలిపారు. మృతులు ముగ్గురూ 26 వ అంతస్తుకు చెందినవారేనన్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







