ఫుట్ బాల్ మ్యాచ్ లో విషాదం, 8 మంది మృతి
- July 16, 2017
వినోదాన్ని పంచాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానం హద్దులు దాటడంతో విషాదాన్ని మిగిల్చింది. పశ్చిమ ఆఫ్రికా దేశం సెనెగల్ లో ఫుట్ బాల్ లీగ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు మధ్య జరిగిన ఘర్షణ ఎనిమిది మంది మృత్యువాత పడటానికి కారణమైంది.
యూఎస్ ఓకామ్-స్టేడ్ డీ బార్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు జట్ల ఫ్యాన్స్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మొదటి యూఎస్ ఓకామ్ అభిమానులు.. స్టేడ్ డీ బార్ ఫ్యాన్స్ పై రాళ్లు విసరడం ఆరంభించారు. దాంతో అవతలి జట్టు అభిమానులు సైతం ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వీరిని బెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించగా కొంతమంది అభిమానులు తమ సీట్లను ఖాళీ చేసేందుకు యత్నించారు. అదే సమయంలో అభిమానుల రద్దీ బాగా పెరిగి సీట్లను అనుకుని ఉన్న గోడ కూలిపోయింది. దాంతో ఎనిమిది మంది తమ ప్రాణాలు కోల్పోగా, మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







