తమిళ్ రీమేక్ సినిమాలో నటించనున్న నిఖిల్
- July 16, 2017
వరుస విజయాల్ని సొంతం చేసుకొంటున్న కథానాయకుల్లో నిఖిల్ ఒకరు. కథల ఎంపికలో తీసుకొంటున్న జాగ్రత్తలే ఆయనకి విజయాల్ని తెచ్చిపెడుతున్నాయి. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా?', 'కేశవ' చిత్రాలతో బాక్సాఫీసు మరోసారి థ్రిల్ చేశారాయన. త్వరలోనే ఓ రీమేక్ చిత్రంలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకొన్నట్టు సమాచారం. తమిళంలో అథర్వ కథానాయకుడిగా 'కణిదన్' పేరుతో ఓ చిత్రం తెరకెక్కింది. నకిలీ సర్టిఫికెట్లపై ఓ యువ జర్నలిస్టు చేసే పోరాటం నేపథ్యంలో ఆ చిత్రం సాగుతుంది. అన్ని వర్గాల్ని మెప్పించి విజయం సొంతం చేసుకొన్న ఆ చిత్రంపై తెలుగు పరిశ్రమ దృష్టి పడింది. దాంతో విడుదలైన వెంటనే రీమేక్ హక్కుల్ని ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి సొంతం చేసుకొన్నారు. ఆ చిత్రంలో రవితేజ నటిస్తారని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు రవితేజ కాకుండా, జూనియర్ రవితేజగా గుర్తింపు పొందిన నిఖిల్ అందులో నటించబోతున్నట్టు సమాచారం. తమిళంలో చిత్రాన్ని తెరకెక్కించిన టి.ఎన్.సంతోష్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. నిఖిల్ కూడా యువ జర్నలిస్టుగా సందడి చేయబోతున్నాడన్నమాట.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







