ఐసిస్ బందీలుగా ఉన్న 39మంది భారతీయులు ఇరాక్ జైల్లో
- July 16, 2017
మోసుల్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర మూడేళ్ల నుంచి బందీలుగా ఉన్న 39 మంది భారతీయులు ప్రస్తుతం ఇరాక్‌లోని జైల్లో ఉన్నట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఆదివారం ఆ 39 మంది భారతీయుల కుటుంబసభ్యులను మంత్రి ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇరాక్‌లో బందీలుగా ఉన్న వారి కుటుంబాలను పిలిచి మాట్లాడాను. వాళ్లని ఇప్పటి వరకు తొమ్మిది సార్లు కలిశాను. కానీ ఈ సారి వాళ్లని కలవడం ప్రత్యేకం. ఎందుకంటే ఐసిస్ ఆధీనంలో ఉన్న మోసుల్ ప్రాంతాన్ని ఇరాకీ సైన్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆదేశ ప్రధానమంత్రి అధికారికంగా ప్రకటించారు. దాంతో వారి వద్ద బందీలుగా ఉన్న 39 భారతీయులను కాపాడి వెనక్కి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయమని మంత్రి వికె.సింగ్‌కు చెప్పాను' అని తెలిపారు. 'కేంద్రమంత్రి వికె సింగ్ ఇరాక్ పర్యటనకు వెళ్లినపుడు భారతీయుల ఆచూకీ గురించి ఆరాతీశారు. వాళ్లంతా బదుష్ జైల్లో ఉన్నట్లు తెలిసింది. ఇరాకీ అధికారుల సమాచారం ప్రకారం ఓ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో ఉన్న భారతీయులను అపహరించారని తెలిసిందని' సుష్మ పేర్కొన్నారు. ఇరాకీ విదేశాంగశాఖ మంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా 39 మంది భారతీయులను వెనక్కి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 39 మందిలో భారతీయుల్లో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందిన కూలీలే ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







