బన్ని తో జతకట్టనున్న అను ఇమ్మాన్యుయెల్‌

- July 16, 2017 , by Maagulf
బన్ని తో జతకట్టనున్న అను ఇమ్మాన్యుయెల్‌

'డీజే: దువ్వాడ జగన్నాథమ్‌' తర్వాత అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య'. 'నా ఇల్లు ఇండియా' అనేది ఉపశీర్షిక. ఇందులో కథానాయికగా 'మజ్ను' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అను ఇమ్మాన్యుయెల్‌ నటిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు ఆదివారం ప్రకటించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్‌-శేఖర్‌ స్వరాలు అందిస్తున్నారు. బన్ని నటించిన 'డీజే' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. ఈ చిత్రంలో బన్ని బ్రాహ్మణ యువకుడిగా కొత్త గెటప్‌లో కనిపించి అలరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com