పాదచారులకోసం 'గొడుగు'
- July 17, 2017
దుబాయ్: దుబాయ్ మునిసిపాలిటీ పాదచారుల కోసం గొడుగుల్ని అందించే సరికొత్త కార్యక్రమం చేపట్టింది. కార్పొరేట్ మార్కెటింగ్ అండ్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఖాలిద్ మొహమ్మద్ బద్రి మాట్లాడుతూ, మునిసిపాలిటీ వెయ్యికి పైగా గొడుగుల్ని తొలి రోజు పాదచారులకు అందజేసినట్లు తెలిపారు. ఎక్కువగా జనం ఉన్న ప్రాంతాల్లో ఈ గొడుగల పంపిణీ కార్యక్రమం చేపట్టామని చెప్పారాయన. ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని బద్రి చెప్పారు. వేసవి తాపం కారణంగా రోడ్లపై ఇబ్బంది పడ్తోన్న సామాన్యులకు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీతో ఈ గొడుగులను అందిస్తున్నామని వివరించారు బద్రి. మునిసిపాలిటీకి చెందిన పబ్లిక్ రిలేషన్స్ హెడ్ ఒమర్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, మహిళలు - పురుషులతో కూడిన టీమ్, ఈ గొడుగులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మెట్రో స్టేషన్లు, పార్క్‌లు తదితర ప్రాంతాల్లో గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గొడుగులతోపాటుగా హ్యాండ్ ఫ్యాన్లను పార్క్‌ల సందర్శకులకు అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







