మక్కా గర్ల్స్ ప్రొటెక్షన్ హోమ్ గొడవ: 9 మంది ఇన్‌మేట్స్ అరెస్ట్
- July 17, 2017
జెడ్డా: మక్కా పోలీసులు, మక్కాలోని గర్ల్స్ ప్రొటెక్షన్ హోమ్‌లో జరిగిన గొడవకు సంబంధించి 9 మంది ఇన్‌మేట్స్‌ని అరెస్ట్ చేశారు. మేనేజ్‌మెంట్‌కి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులకు కారణమవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆందోళనకారుల్ని శాంతింపజెయ్యాల్సి వచ్చింది. ఈ ఘటనలో హోమ్ కొంతమేర ధ్వంసమయ్యింది. ఆ హోమ్‌కి సంబంధించిన మేనేజ్‌మెంట్ అక్కడివారి సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యిందనీ, ఈ కారణంగానే ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోందనీ గతంలోనే నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎన్‌ఎస్‌హెచ్‌ఆర్) పేర్కొంది. ఇంకో వైపున ఇన్‌మేట్స్ కూడా నిబంధనల్ని అతిక్రమించినట్లు తేలింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ అధికార ప్రతినిథి ఖాలెద్ అబా అల్ ఖైల్ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించిన ఇన్‌మేట్స్‌పై చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







