కామెరూన్లో 30 మంది సైనికుల గల్లంతు
- July 17, 2017
యవోండే: ఆఫ్రికా దేశం కామెరూన్లో జరిగిన ఓడ ప్రమాదంలో 34 మంది జాడ తెలియకుండా పోయారు. ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ బ్రిగేడ్‌కు చెందిన సైనికులు తమ ఓడలో ఇంధనం నింపుకునేందుకు బకాస్సీ నగరం వైపు వస్తుండగా సముద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా పడవ మునిగిపోవటంతో అందులోని 37 మంది నీట మునిగారని, తక్షణం స్పందించిన సైన్యం ముగ్గురిని రక్షించగలిగిందని రక్షణశాఖ మంత్రి జోసెఫ్ బెటి అస్సోమో తెలిపారు.
ఇంకా 30 మంది జాడ కోసం గాలింపు చేపట్టామని వివరించారు. ఈ ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిన బోకో హరామ్ ముస్లిం తీవ్రవాదులను ఏరివేసేందుకు కామెరూన్ ప్రభుత్వం ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక









