జిఎస్టీ అమలుతో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి
- July 18, 2017
ఆ నెల 1నుంచి అమల్లోకి వచ్చిన జిఎస్టీ ని అమలు చేసే విషయంల తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని సిఎం కెసిఆర్ అన్నారు.. మొదటి పక్షం రోజుల్లోనే 90శాతం నుంచి వాట్ ఖాతాదాలరును జిఎస్టీ పరదిలోకి తీసుకురాగలిగామని అన్నారు.. 1.92 లక్షల మందిట్రేడర్లు, ఈనెల 15 వరకు జిఎస్టీలో అనుసంధానమై నెంబర్లు పొందారని అన్నారు.. ట్రేడర్లందరినీ అధికారులు వ్యక్తిగతంగా కలిసి జిఎస్టీ పరిధిలోకి తెచ్చారని, 15 రోజులో ఇంతటి పురోగతి సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు.. జిఎస్టీపై చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు, గందరగోళం కొనసాగుతున్నా నేపథ్యంలో తెలంగాణ ఇంత విజయం సాధించటం గొప్ప విషయమని కేంద్రం కితాబిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
జిఎస్టీలో ఇంత తక్కువ సమయంలో విజయం సాధించినందుకు అధికారులను సిఎం అభినందించారు.. ఈనెలాఖరులోఆ వందశాతం రిజిస్ట్రేషన్లు పూర్తికావాలని ఆయన ఆదేశించారు.. అలాగే వస్త్ర, గ్రానైట్, బిడి పరిశ్రమలపై జిఎస్టీ విషయంలో రాయితీలు, మినహాయింపులు కోరామని, దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిఎస్టీ కౌన్సిల్‌లో ఇప్పటికే ఈ విషయానిన లేవనెత్తామిన, తానుకూడ స్వయంగా ప్రధానికి లేఖ రాసినట్టు కెసిఆర్ వివరించారు.. ఆయా రంగాలపై ఆధారపడే తెలంగాణలో సంగం మంది బతుకుతున్నారని, జిఎస్టీతో వీరికి ప్రతికూలత ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్







