ఫ్యూయల్‌ వేగంగా నింపేందుకు లాంగర్‌ హోసెస్‌

- July 19, 2017 , by Maagulf
ఫ్యూయల్‌ వేగంగా నింపేందుకు లాంగర్‌ హోసెస్‌

ఒమన్‌ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ, వాహనాల్లో ఫ్యూయల్‌ని వేగంగా నింపేందుకోసం పొడవైన హోసెస్‌ని ఫ్యూల్‌ స్టేషన్లలో అమర్చుతోంది. ఒమన్‌లో చాలావరకు వాహనాలు ఎడమవైపున ఫ్యూయల్‌ ట్యాంక్స్‌ని కలిగి ఉంటాయి. ఈ కారణంగా ఓ వైపు ఎక్కువ క్యూ లైన్‌ కనిపిస్తుంటుంది. కొత్తగా అమల్లోకి తెచ్చిన లాంగర్‌ హోస్‌తో ట్యాంకు ఎటువైపు ఉన్నా ఫ్యూయల్‌ నింపడం తేలికవుతుంది. ఆయిల్‌ ధరల్లో మార్పు సంభవించిన ప్రతిసారీ ఒమన్‌ ఫిలింగ్‌ స్టేషన్లలో క్యూ లైన్‌ విపరీతంగా కనిపిస్తుంటుంది. ఇకపై అలాంటి క్యూ లైన్లకు ఆస్కారం ఉండదు. రద్దీ సమయాల్లో తమకు ఉపశమనం కలుగుతుందని ఈ కొత్త విధానంపై వాహనదారులు చెబుతున్నారు. ఒమన్‌ పొరుగు దేశాలైన యూఏఈ, ఖతార్‌ ఈ విధానాన్ని ఇంతకు ముందే అమల్లోకి తెచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com