తమిళ రాజకీయాల్ని వేడెక్కించిన కమల్ !
- July 19, 2017
కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం పై మరోసారి కలకలం రేగింది. ఆయన అర్థరాత్రి పెట్టిన ట్వీట్లు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి. తమిళంలో కమల్ పెట్టిన ట్వీట్లు ఆయన త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే విషయాన్ని బయటపెడుతున్నాయి. నేను ముఖ్యమంత్రిని కావాలని నిర్ణయిస్తే అని ఒక కవితలా ట్వీట్ చేశారు కమల్.. సామాన్యులు తనతో చేతులు కలపాలని కోరారు. తన కవిత ఎవరికైనా అర్థంకాకుంటే ఇంగ్లీష్ వార్తా పత్రికల్లో దాని అర్థాన్ని వెతుక్కోవచ్చన్నారు. దీంతో తమిళ మీడియా ఒక్కసారిగా కమల్ రాజకీయాల్లోకి రావడం ఖాయమంటోంది. అటు రజనీ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అయిపోవడంతో తమిళ రాజకీయాల్లో మరోసారి రజనీ వర్సస్ కమల్ పోటీ మొదలవుతుందని చెబుతుంది. అన్నాడీఎంకే మంత్రుల నుంచి వచ్చిన విమర్శలు, ఇబ్బందులతోనే కమల్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడనే వార్తలూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









