పోలీసులకు గుండెళ్ళో రైళ్లు పరుగెత్తించిన సోషల్ మీడియాలో బాలుని ఫోటో పోస్ట్
- July 21, 2017
ఏదైనా పాత ఫోటో దొరికితే చాలు...వెంటనే వాటికి కల్పిత గాధలను జోడించి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం అవి సంచలనం కల్గించగానే...అదో పెద్ద విజయం సాధించినట్లు తెగ ఆనందపడే ప్రబుద్ధులు ఇటీవల అధికమయ్యారు. అటువంటి ప్రయోగానికి ఈసారి రాయల్ ఒమాన్ పోలీసులు బలయ్యారు. పోలీసు స్టేషన్లో గత 40 రోజులుగా ఉంటున్న ఒ చిన్న పిల్లవాడు ఉబికి వస్తున్న కన్నీళ్ల తో దీనంగా పోలీసుల ఎదుట నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియా లో ఇటీవల చక్కర్లు కొడుతోంది.ఆ పుకారుకు మాకు ఎటువంటి సంబంధం లేదని...ఆ పిల్లవాడు తమ ఆధీనంలో లేనే లేదని రాయల్ ఒమన్ పోలీసులు లబోదిబోమంటూ గగ్గోలు పెడుతున్నారు.వాస్తవానికి, ఈ ఫోటో పాకిస్తాన్ ప్రాంతంలో తప్పిపోయిన ఏడు ఏళ్ల బాలుడి దని 2016 లో పాకిస్తానీ వార్తాపత్రికలో ఆ వార్తను సైతం ప్రచురించారని పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత ఆ బాలుడిని భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో కనుగొన్నారు. పాకిస్తానీ వార్తాపత్రిక కధనం ప్రకారం, కనిపించకుండా పోయినపుడు ఫోటోలో బాలుని వయస్సు ఐదు సంవత్సరాలు మాత్రమేనని తెలిపింది. తర్వాత ఏడు సంవత్సరాల వయస్సులో బాలుని ఆచూకీ దొరికింది.. పాకిస్థానీ లో ఆ బాలుని తల్లితండ్రులు ఇరు ప్రాంతాల మధ్య గృహాబదిలీ చేస్తున్నసమయంలో జూన్ 6 వ తేదీన 2014 లో ఆ బాలుడు తన కుటుంబం నుండి తప్పిపోయాడు. ఇపుడు ఎనిమిదేళ్ల వయస్సులో ఆ బుడతడు సోషల్ మీడియా పుణ్యామాని వెలుగులోనికి వచ్చి రాయల్ ఒమన్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







