'వైశాఖం`స‌క్సెస్: కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన లేడీ డైరెక్ట‌ర్

- July 22, 2017 , by Maagulf
'వైశాఖం`స‌క్సెస్: కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన లేడీ డైరెక్ట‌ర్

'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి సూపర్‌హిట్స్‌ తర్వాత డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్‌ క్రేజీ చిత్రం 'వైశాఖం'. ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై హరీష్‌, అవంతిక జంటగా అభిరుచిగల నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన 'వైశాఖం' చిత్రం జూలై 21న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ అయింది. సూపర్‌హిట్‌ టాక్‌తో సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లోనిర్వహించింది. ఈ సందర్భంగా.... 
డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ.బి మాట్లాడుతూ - ''మీడియా రంగం నుండే నేను కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. అందుకనే మీడియా వారిని నా స్వంత మనుషుల్లా భావిస్తుంటాను. వైశాఖం సినిమా విడుదలైన అన్ని సెంటర్స్‌లో హిట్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. అమెరికా నుండి కూడా సినిమా మంచి టాక్‌ వచ్చింది. ఈ సినిమా కోసం ఏడాది పాటు బాగా కష్టపడ్డాం. క్లాస్‌, మాస్‌ ఆడియెన్స్‌ అందరినీ మెప్పించే సినిమాగా మన్ననలు పొందింది. మంచి టీం సహకారంతో సినిమాను బాగా తీయగలిగాను. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాను. నా నిజ జీవితంలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను చేశాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు అప్పటి పరిస్థితుల్లో నేను ఎదుర్కొన మానసిక సంఘర్షణతో కథను తయారు చేసుకున్నాను. సినిమా చూసిన మా అమ్మగారు, మా కుటుంబ సభ్యులంతా ఎంతగానో మెచ్చుకున్నారు. ఓ కూతురిగా మా అమ్మగారికి నచ్చే సినిమా చేసినందుకు గర్వంగా ఉంది'' అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com