'దర్శకుడు' ప్రేమలో పడతే....

- July 22, 2017 , by Maagulf
'దర్శకుడు' ప్రేమలో పడతే....

ఓ సినీ దర్శకుడు అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు. తన వృత్తిలో రాణిస్తూనే ప్రేమను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సంఘర్షణ ఏమిటన్నదే దర్శకుడు చిత్ర ఇతివృత్తం అన్నారు చిత్ర దర్శకుడు హరిప్రసాద్ జక్కా. స్వీయ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 4న ప్రేక్షకులముందుకు రానుంది.
 ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ... ఇటీవల విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఈ నెల 29న అల్లు అర్జున్ అతిథిగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నాం అని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com