5 రూపాయలకే లీటర్ మంచినీళ్లు
- July 23, 2017
2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 450 రైల్వేస్టేషన్లలో 1,100 వాటర్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని ది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) లక్ష్యంగా పెట్టుకొంది. ప్రయాణికులకు తక్కువ ధరకు సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేయనుంది. 300 మి.లీ. నీటిని రూ.1 అందించాలని యోచిస్తోంది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వశాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. తక్కువ ధరకు సురక్షిత మంచినీటిని అందించడమే కాకుండా దీని ద్వారా సుమారు 2వేల మందికి ఉపాధిని కూడా కల్పించనుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 345 రైల్వే స్టేషన్లలో 1,106 వాటర్ వెండింగ్ మెషీన్లు ఉన్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. 2015లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా అందుబాటు ధరకు ప్రయాణికులకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. ఆర్వో మెషీన్ల ద్వారా మంచినీటిని అందించనున్నారు. ఇవి 24గంటలూ పనిచేయనున్నాయి. అరలీటర్ రూ.3కు, లీటర్ రూ.5, రెండు లీటర్లు రూ.8, ఎనిమిది లీటర్ల క్యాన్ రూ.20లకు అందించనున్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







