ఘనంగా వైఎస్సార్ జయంతి స్కాట్లాండ్లో
- July 23, 2017
దివంగత మహానేత వైఎస్సార్ జయంతిని స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఘనంగా నిర్వహించారు. యూకే–యూరప్ వైఎస్సార్సీపీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పార్టీ తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి అమృతసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జన సంక్షేమానికి పాటుపడిన వైఎస్సార్ నేటికీ నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఆయన దక్షిణ భారత దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్మయుద్ధం చేస్తున్నారన్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మద్దతు పలికి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర విభాగం నాయకులు కేసరి సాగర్, యూకే–యూరప్ వింగ్ నాయకులు డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, శివ, వాసుదేవరెడ్డి, ఓబుల్‌రెడ్డి, జయంతి, అనిల్ బెంజిన్, గోపాల్, గీత పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







