తండ్రి పవన్ ని మించిన కొడుకు అకిరా

- July 25, 2017 , by Maagulf
తండ్రి పవన్ ని మించిన కొడుకు అకిరా

టాలీవుడ్ ఎంపరర్ గా కోట్లాది మంది అభిమానులను పొందిన పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఏ వార్త వచ్చినా అది పవన్ అభిమానులకు హాట్ న్యూస్ గా మారుతుంది. తన వ్యక్తిగత జీవిత విధానంలోనే కాకుండా తన ఆలోచనలలో రాజకీయ సిద్ధాంతాలలో ప్రత్యేకతను అనుసరిస్తూ సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతున్నాడు పవన్.
సాధారణంగా ప్రచారాలకు ఫంక్షన్స్ కు దూరంగా ఉండే పవన్ విదేశాల్లో జరిగే తన సినిమా షూటింగులకు భార్య పిల్లలను తీసుకుని రావడం చాలా అరుదు. అయితే ఈ సారి తన పద్ధతికి భిన్నంగా తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని బల్గేరియా వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సంబంధించి పాటల షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. అయితే అనూహ్యంగా షూటింగ్ తో పాటు ఫ్యామిలీ వెకేషన్ కూడా ప్లాన్ చేశాడు పవర్ స్టార్ పవన్. ఈసారి పవన్ కళ్యాణ్ వెంట ఆయన భార్య అన్నా లెజెనివా, కూతురు పోలెనాతో పాటు అకీరా నందన్, ఆద్యా కూడా ఉండటం చాలామందిని ఆశ్చర్య పరిచింది.
ఎయిర్ పోర్ట్ లో పవన్ తన కుటుంబ సభ్యులతో వడివడిగా నడుస్తున్న ఫోటోలను ఎవరో ఒక అభిమాని క్యాచ్ చేసి మీడియాకు లీక్ చేసాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆశ్చర్య కరంగా కేవలం 14 సంవత్సరాలు మాత్రమే ఉన్న పవన్ కొడుకు పవన్ వెనుక నడుస్తూ పవన్ కన్నా ఎత్తుగా కనిపించడంతో అప్పుడే అకిరా పవన్ ను మించిపోయాడు అంటూ పవన్ అభిమానులు జోక్ చేస్తున్నారు.
పవన్ ఇక తాను ఎంతో కాలం సినిమాలలో నటించనని ఇప్పటికే అనేకసార్లు సంకేతాలు ఇచ్చాడు. టాప్ హీరోలు అందరికీ వారసులు ఇప్పటికే రెడీ అయిన నేపధ్యంలో అకిరా నందన్ కూడ పవన్ వారసుడుగా ఎదగాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ వారసత్వ సాంప్రదాయాన్ని అకిరా ఎంత వరకు కొనసాగిస్తాడో చూడాలి.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com