భారత్‌కు చైనా హెచ్చరిక
- July 28, 2017
భారత్-చైనా డోక్లామ్ సరిహద్దు వివాదం రగులుతూనే ఉంది. ఈ విషయంలో రాజీ దిశగా చైనా ఆలోచిస్తుందన్న ప్రచారం వట్టిదేనని ఆ దేశ అంతర్జాతీయ సంబంధాల పరిశోధకుడు హు జియాంగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.
డోక్లామ్ విషయంలో తమ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకునేది లేదని, తమ భూభాగం నుంచి తమ సైన్యాన్నే వెనక్కి ఎలా తీసుకుంటామని ప్రశ్నించింది. ఈ సందర్భంగా హు జియాంగ్ భారత్ తో చర్చల గురించి ప్రస్తావించారు. బ్రిక్స్ సమావేశంలో భాగంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లినంత మాత్రానా.. చైనా రాజీకి వస్తుందనుకోవడం సరికాదని అన్నారు.
ఈ అంశాన్ని ఉటంకిస్తూ చైనా రాజీ ధోరణి అంటూ భారత మీడియా ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికైనా ఊహాగానాలకు తెరదించాలని సూచించారు. 'చైనా నిర్ణయం మారదు.. భారత ప్రభుత్వం, అక్కడి మీడియా మేం రాజీపడుతున్నట్లుగా ఊహాగానాలు కల్పించడం సరికాదు' అని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







