ప్రపంచంలో అతిపొడవైన ఎలక్ట్రిక్ హైవే సిడ్నీలో
- July 28, 2017
ఆటోమొబైల్ రంగంలో భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వాహనాలదే. అన్ని కంపెనీలు ప్రస్తుతం వీటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే ఇందుకు తగ్గ మౌలిక వసతులు కూడా పెరగాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ దేశాలు ఆ దిశగా కృషి చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా తమ దేశంలో అతిపొడవైన ఎలక్ట్రిక్ హైవేను రూపొందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన హైవేల్లో ఒకటని పేర్కొంటోంది.
క్వీన్స్లాండ్ తీర ప్రాంతంలో 18 నగరాలను కలుపుతూ 2000 కి.మీ పొడవైన ఎలక్ట్రిక్ హైవేను రూపొందించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది. బ్రిస్బేన్ నుంచి టుల్లీ వరకూ భారీ ఖర్చుతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ హైవే పొడవునా వాహనాలు త్వరితగతిన ఛార్జింగ్ చేసుకునే స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఈ సదుపాయాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది.
భవిష్యత్‌లో కారు కొనాలనుకునే వారిలో సగం మంది ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారని క్వీన్స్‌లాండ్‌లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ.. కొన్ని మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ హైవే నిర్మాణంతో ఆ కొరత తీరనుందని అధికారులు భావిస్తున్నారు.
.
33332
32
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







