మక్కాపై టార్గెట్‌ చేసిన మిసైల్‌ కూల్చివేత

- July 28, 2017 , by Maagulf
మక్కాపై టార్గెట్‌ చేసిన మిసైల్‌ కూల్చివేత

జెడ్డా: సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌, యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్స్‌ మక్కాని టార్గెట్‌ చేస్తూ ఎక్కుపెట్టిన మిసైల్‌ని కూల్చివేయడం జరిగింది. అల్‌ తైఫ్‌ ప్రావిన్స్‌లోని అల్‌ వస్లియా ప్రాంతంలో ఈ మిస్సైల్‌ని కూల్చివేసినట్లు కోలిషన్‌ కమాండ్‌ పేర్కొంది. మక్కాకి 69 కిలోమీటర్ల దూరంలో ఈ మిసైల్‌ని కూల్చివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కూల్చివేత సందర్భంగా ఎలాంటి డ్యామేజీ జరిగినట్లు వార్తలు వెలువడలేదు. హజ్‌ సీజన్‌ని టార్గెట్‌ చేస్తూ తీవ్రవాదులు ఈ దాడికి యత్నించారని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌ 27న ఇదే తరహాలో యెమెన్‌ నుంచి హౌతీ మిసైల్‌ దూసుకొచ్చింది. దాన్ని కూడా సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ మధ్యలోనే కూల్చివేశాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com