మక్కాపై టార్గెట్ చేసిన మిసైల్ కూల్చివేత
- July 28, 2017
జెడ్డా: సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్, యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్స్ మక్కాని టార్గెట్ చేస్తూ ఎక్కుపెట్టిన మిసైల్‌ని కూల్చివేయడం జరిగింది. అల్ తైఫ్ ప్రావిన్స్‌లోని అల్ వస్లియా ప్రాంతంలో ఈ మిస్సైల్‌ని కూల్చివేసినట్లు కోలిషన్ కమాండ్ పేర్కొంది. మక్కాకి 69 కిలోమీటర్ల దూరంలో ఈ మిసైల్‌ని కూల్చివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కూల్చివేత సందర్భంగా ఎలాంటి డ్యామేజీ జరిగినట్లు వార్తలు వెలువడలేదు. హజ్ సీజన్‌ని టార్గెట్ చేస్తూ తీవ్రవాదులు ఈ దాడికి యత్నించారని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్ 27న ఇదే తరహాలో యెమెన్ నుంచి హౌతీ మిసైల్ దూసుకొచ్చింది. దాన్ని కూడా సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్యలోనే కూల్చివేశాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







