ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు పనుల వేగతరం

- July 28, 2017 , by Maagulf
ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు పనుల వేగతరం

మనామా: ఇసా టౌన్‌ నార్తరన్‌ ఎంట్రన్స్‌కి సంబంధించి ట్రాఫిక్‌ సిగ్నల్‌ని అభివృద్ధి చేసే పనులు వేగంగా జరుగుతున్నట్లు వర్క్స్‌ మినిస్ట్రీ పేర్కొంది. వాహనదారులు ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ రెగ్యులేషన్స్‌ని అలాగే సూచనల్ని పాటించాలని అధికారులు పేర్కొన్నారు. సల్మాబాద్‌ ఇంటర్‌ఛేంజ్‌ సామర్థ్యాన్ని పెంచే పనులు అలాగే సిగ్నల్‌ ఫేజెస్‌ని ఐదు నుంచి మూడు వరకు తగ్గించేందుకు పనులు ముమ్మరంగా చేపడ్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌ అత్యవసరంగా కొన్ని ప్రాజెక్టుల్ని ప్రకటించగా, 11 ప్రాజెక్టులకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం లభించింది. 2022 నాటికి ట్రాఫిక్‌ సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది ఈ ప్రాజెక్టుల ద్వారా. వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచిస్తూ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటికే స్పష్టతనిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com