ఉత్తర కొరియా మరో ఖండాంతర క్షిపణి
- July 29, 2017
► పరీక్షించిన ఉత్తర కొరియా
► అమెరికా మొత్తం దీని పరిధిలోకి..!
అగ్రదేశం అమెరికా సహా ప్రపంచ దేశాల హెచ్చరికలను ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. శుక్రవారం రాత్రి మరోమారు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని ప్రయోగించింది. ఈ నెలలో ఐసీబీఎం ప్రయోగాన్ని రెండోమారు జరిపిన ఉత్తర కొరియా.. తాజా క్షిపణితో అమెరికాలోని ఏ ప్రాంతంలోనైనా దాడులు చేయగలమని స్పష్టం చేసింది.
అమెరికాకు గట్టి హెచ్చరికలు పంపేందుకే ఈ పరీక్ష జరిపినట్లు దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చెప్పారు. అమెరికాలోని ఏ ప్రాంతం పైనైనా దాడి చేయగలమని కిమ్ చెప్పినట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నెల 4న ప్రయోగించిన క్షిపణి కంటే తాజా క్షిపణి అత్యంత శక్తిమంతమైనదని, దాని పరిధి 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ వంటి నగరాలు ఆ క్షిపణి పరిధిలోకి వస్తాయని హెచ్చరిస్తున్నారు.
నిర్లక్ష్య, ప్రమాదకర చర్య: ట్రంప్
ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష నిర్లక్ష్య, ప్రమాదకర చర్య అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. అంతర్జాతీయ సమాజంలో ఉత్తర కొరియా తనను తాను ఒంటరి చేసుకుంటోందని పేర్కొన్నారు. అమెరికా భూభాగాన్ని రక్షించుకునేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష జరపడాన్ని చైనా ఖండించింది. ఉద్రిక్తతలు పెంచే చర్యలు మానుకోవాలని హితవుపలికింది. ప్రస్తుత పరిస్థితిపై ఆందోళనపడుతున్నామని పేర్కొంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







