భారత్ లో భారీగా పెరిగిన విమానాయగం
- July 31, 2017
భారత్‌లో విమానయానం రోజురోజుకూ పెరుగుతోందని ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ పేర్కొంది. దీంతో రానున్న 20 ఏళ్లలో 2,100 కొత్త విమానాలను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. దీని విలువ సుమారు 290 బిలియన్ డాలర్లుగా ఉండనుందని అంచనా వేసింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌లో విమానయానం అధిక వృద్ధి కనబరుస్తోందని ఆ కంపెనీ ఆసియా పసిఫిక్, ఇండియా సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేస్కర్ పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా భారత విమానయానంలో 20 శాతం మేర వృద్ధి కనబరుస్తోందని పేర్కొన్నారు. రానున్న 20 ఏళ్లలో దక్షిణాసియాలో ప్రయాణికుల్లో వృద్ధి రేటు సగటు 8 శాతంగా ఉండనుందని, ప్రపంచవ్యాప్త సగటు 4.7 శాతం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీన్ని భారత్ అధిగమిస్తుందని తెలిపారు. ఎక్స్ఛేంజ్ రేట్ స్థిరంగా ఉండడం, తక్కువ ఇంధన ధరలు, తక్కువ ధరకే విమాన ప్రయాణం వంటి కారణాలు భారత్‌లో విమాన ప్రయాణాలకు పెరుగుదలకు వూతమిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పథకం (ఉడాన్) ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూసి దానిబట్టి తమ అంచనాలను సవరిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో తీసుకురాబోయే 737, 737 మ్యాక్స్ వంటి 1780 విమానాలను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా రానున్న 20 ఏళ్లలో 41,030 విమానాలు కొనుగోలు జరిగే అవకాశం ఉందని, ఇందులో భారత్ వాటా 5 శాతంగా ఉండనుందని తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







