‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్ర షూటింగ్లో గాయపడిన ప్రగ్యాజైశ్వాల్
- July 31, 2017
యువ కథానాయకుడు మంచు విష్ణుతో పాటు తానూ గాయపడినట్లు ప్రగ్యాజైశ్వాల్ తెలిపారు. విష్ణు కథానాయకుడిగా జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం పది రోజుల క్రితమే మలేషియా వెళ్లింది చిత్ర బృందం. ఆదివారం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయంలో మంచు విష్ణు మోటార్ సైకిల్‌పై నుంచి కింద పడిపోయారు. మెడ, భుజంపై గాయాలు కావడంతో ఆయన్ని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. విష్ణుతో పాటు బైక్‌పైన ఉన్న ప్రగ్యాజైశ్వాల్ కూడా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా తెలుపుతూ ‘జరిగిన ప్రమాదం గురించి తెలిసి స్పందించిన వారికి ధన్యవాదాలు. మంచు విష్ణు, నేనూ ఇద్దరం గాయపడ్డాం. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తా. షూటింగ్ షెడ్యూల్ అర్ధంతరంగా ముగియడంతో హైదరాబాద్ వచ్చేస్తున్నాం. మంచువిష్ణు త్వరలోనే మీతో మాట్లాడతారు’ అని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







