ఇబ్బందిగా మారిన పాక్‌ సరిహద్దులోని అతిపెద్ద జెండా

- July 31, 2017 , by Maagulf
ఇబ్బందిగా మారిన పాక్‌ సరిహద్దులోని అతిపెద్ద జెండా

శాశ్వత శత్రువు పాకిస్థాన్‌కు కనిపించేలా ఏర్పాటు చేసిన అతిపెద్ద త్రివర్ణ పతాకం మూడు నెలలుగా కనిపించడం లేదు. భారత్‌-పాక్‌ సరిహద్దులోని అట్టారిలో 360 అడుగుల పొడవైన భారీ జెండాను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంత ఎత్తులో ఉండటం.. గాలి వేగంగా వీస్తుండటంతో పతాకం ప్రతిసారీ చిరగడం.. అమృత్‌సర్‌ పరిపాలన విభాగం తొలగించడం జరిగిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చిరిగిన పతాకాన్ని తొలగించిన తర్వాత మళ్లీ కొత్త జెండా ఎగరేయలేదు. మువ్వన్నెల పతాకం చిరిగి ఇబ్బంది పెడుతోందని అమృత్‌సర్‌ డిప్యూటీ కమిషనర్‌ కమల్‌దీప్‌ సింగ్‌ సంఘా రాష్ట్ర హోం మంత్రిత్వశాఖకు లేఖ కూడా రాశారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలీక హోం శాఖ మల్లగుల్లాలు పడుతోంది.

పెరిగిన ఖర్చు:
సరిహద్దుల్లో జెండాతో పాటు అమృత్‌సర్‌ నగరంలోని 170 అడుగుల జెండాను అధికారులు తొలగించారు. అట్టారి జెండా మూడు సార్లు చిరిగిపోగా ఈ జెండా 13 సార్లు చిరిగింది. 15 రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం వస్తుండటంతో అప్పటిలోగా పతాకాలను పునరుద్ధరిస్తారో లేదో తెలియడం లేదు. ఈ అంశంపై అమృత్‌సర్‌ ఎంపీ గుర్జీత్‌ సింగ్‌ ప్రభుత్వంతో, మంత్రి నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూతో మాట్లాడతానని చెప్పారు. జెండాల బాధ్యత ఉన్న అమృత్‌సర్‌ అభివృద్ధి సంస్థకు ఈ రెండు పతకాల నిర్వహణ భారంగా మారింది. ఇప్పటి వరకు సరిహద్దు జెండాకు రూ.3 లక్షలు, నగరంలోని జెండాకు రూ.6 లక్షలు ఖర్చుచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com