ప్రభాస్ తో మరో సినిమా చేయనున్న రాజమౌళి

- July 31, 2017 , by Maagulf
ప్రభాస్ తో మరో సినిమా చేయనున్న రాజమౌళి

మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టేందుకు ఆ ఇద్దరూ సిద్ధమవుతున్నారట. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఆ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాకి కథ కూడా ఫైనల్ అయ్యిందట.
 
రాజమౌళి-ప్రభాస్ వీరిద్దరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన 'ఛత్రపతి', 'బాహుబలి ద బిగినింగ్', 'బాహుబలి ద కంక్లూజన్' చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. అలాంటి వీరి కలయికలో ఇప్పుడు మరోసారి సినిమా రాబోతోందట.
 
'బాహుబలి' సమయంలోనే ప్రభాస్‌కు ఓ కథను వినిపించాడట జక్కన్న. ఆ స్టోరీ బాగా నచ్చేయడంతో సినిమా చేస్తానన్నాడట యంగ్ రెబెల్ స్టార్. అయితే ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత 'జిల్' రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు.   మరోవైపు రాజమౌళి కూడా డి.వి.వి. దానయ్య, కె.ఎల్.నారాయణతో సినిమాలు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వారితో చేసే సినిమాకోసమే ఇప్పుడు కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు ఈ స్టార్ డైరెక్టర్.

మొత్తంమీద ప్రయర్ కమిట్ మెంట్స్‌ను పూర్తి చేసే పనిలో ఉన్న రాజమౌళి-ప్రభాస్.. కుదిరితే వచ్చే యేడాది తమ కలయికలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. మరి ప్రేక్షకులకు మరోసారి 'బాహుబలి' కాంబినేషన్‌ను తెరపై చూసే అవకాశం ఎంత తొందరగా దొరుకుతుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com