శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో దావూద్ సోదరి చిత్రం వాయిదా
- August 01, 2017
శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హసీనా: ది క్వీన్ ఆఫ్ ముంబయి’. అపూర్వ లఖియా దర్శకుడు. ముంబయి అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 18న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.
ఇదే నెలలో షారుక్ నటించిన ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’, అక్షయ్ కుమార్ నటించిన ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథా’ చిత్రాలు విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రాన్ని వాయిదా వేయాలని దర్శకుడు అపూర్వ లఖియా నిర్ణయించారు.
ఈ విషయమై దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హసీనా’ చిత్రాన్ని ఆగస్ట్ 18న విడుదల చేయాలనుకున్నాం. కానీ షారుక్, అక్షయ్ సినిమాలు కూడా అప్పుడే విడుదల అవుతున్నాయి. అందులోనూ అక్షయ్ చిత్రానికి పన్ను మినహాయింపు ఉంది. అలాంటప్పుడు మా సినిమాను విడుదల చేసి ప్రమాదం కొనితెచ్చుకోవాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







