ప్రపంచ మార్కెట్ల పసిడి ధర పెరిగింది
- October 21, 2015
ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఈ రోజు బంగారం ధర పెరిగింది. రూ.105 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.27,335కి చేరింది. అమెరికా వడ్డీ రేట్లు పెంపు విషయంపై వచ్చే వారం ఫెడరల్ రిజర్వ్ సమావేశమవుతుండటం, 2016 వరకు వడ్డీ రేట్లు పెరగకపోవచ్చన్న వదంతులు వ్యాపిస్తుండటం తదితర కారణాలు అంతర్జాతీయంగా బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. సింగపూర్ మార్కెట్లో సైతం ఔన్సు బంగారం ధర 0.3శాతం పెరిగి 1,179.35 అమెరికన్ డాలర్లకు చేరింది.రూ.37,000 దిగువకు వెండిఅమ్మకాల ఒత్తిడితో ఈ రోజు వెండి ధర రూ.175 తగ్గి రూ.36,900కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో ఈ లోహం ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







