భార్య వీసా కోసం టెనెన్సీ కాంట్రాక్ట్‌ ఫోర్జరీ

- August 01, 2017 , by Maagulf
భార్య వీసా కోసం టెనెన్సీ కాంట్రాక్ట్‌ ఫోర్జరీ

అబుదాబీ వలసదారుడొకరు, తన భార్య వీసా కోసం టెనెన్సీ కాంట్రాక్ట్‌ని ఫోర్జరీ చేయగా, నిందితుడు కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నాడు. నిందితుడ్ని సిరియాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. టెనెన్సీ కాంట్రాక్ట్‌తోపాటుగా, మునిసిపాలిటీకి సంబంధించిన స్టాంప్‌ని కూడా నిందితుడు ఫోర్జరీ చేయడం జరిగింది. ఫోర్జరీ పత్రాల్ని అబుదాబీ రెసిడెన్సీ మరియు ఫారినర్స్‌ ఎఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌కి పంపించాడు. సిరియాలో ఉంటోన్న తన భార్యను తనతోపాటుగా అబుదాబీకి తెచ్చేందుకోసం ఈ సాహసానికి ఒడిగట్టాడు నిందితుడు. విచారణలో టెనెన్సీ కాంట్రాక్ట్‌ ఫోర్జరీకి గురైనట్లు అధికారులు ధృవీకరించారు. అయితే ఫోర్జరీ ఆరోపణల్ని నిందితుడు ఖండిస్తున్నాడు. 3,000 దిర్హామ్‌లు చెల్లించి టెనెన్సీ కాంట్రాక్ట్‌ పొందినట్లు ఆయన చెబుతున్నాడు. ఓ వ్యక్తి ద్వారా ఆ కాంట్రాక్ట్‌ని తెప్పించుకున్నానని అంటున్నాడు నిందితుడు. నిందితుడు పేర్కొన్న వ్యక్తిని న్యాయస్థానం యెదుట హాజరు పర్చాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్‌కి వాయిదా పడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com