ప్రపంచంలోనే ఎత్తైన టిబెట్ పీఠభూమిపై ఎక్స్‌ప్రెస్ మార్గం ప్రారంభం
- August 01, 2017
ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి టిబెట్‌పై చైనా ఎక్స్‌ప్రెస్ రహదారి మార్గాన్ని ప్రారంభించింది. కింఘై ప్రావిన్సులోని గాంగ్హె కౌంటీని వుషు నగరంతో కలుపుతూ దీన్ని నిర్మించింది. 634.8 కి.మీ. పొడవైన ఈ మార్గం కోసం దాదాపు రూ.25.6వేల కోట్లను చైనా ఖర్చు చేసింది. సగటున 4వేల మీటర్ల ఎత్తులో ఈ రహదారి ఉంటుంది. రహదారిలో 36శాతం పెర్మాఫ్రాస్ట్ (మంచు) నేలపైనే నిర్మించారు. వాహనాల వల్ల ఏర్పడే ఉష్ణోగ్రత మార్పులకు ఈ నేల కరిగిపోతుంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేలను స్థిరంగా ఉంచి.. నిర్మాణం చేపట్టారు. ఈ మార్గం ద్వారా యుషు, ప్రావిన్సు రాజధాని షినింగ్ల మధ్య ప్రయాణ సమయం.. 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







