వలసదారులకు శాశ్వత నివాసాన్ని మంజూరు చేసేందుకు ప్రణాళిక
- August 03, 2017
శాశ్వత నివాసిత గుర్తింపు కార్డు గల ప్రవాసులకు శాశ్వత నివాసాన్ని మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం పొందింది. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖలో పేర్కొన్న షరతులకు అనుగుణంగా ఈ బిల్లు నిబంధనల ప్రకారం, ఖతార్ కానివారికి శాశ్వత నివాస గుర్తింపు కార్డుని మంజూరు చేయవచ్చు. ఖతారేతో పాటు దేశం కొరకు విలువైన సేవలను అందించే వారికి మరియు దేశంకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలతో ప్రజలకు ఈ కార్డు అందించవచ్చు. ఒక ఖతరీ మహిళ ఖతరీ కానీ వ్యక్తిని పెళ్లి చేసుకొంటే వారి పిల్లలకు ఈ గుర్తింపు కార్డునిఇస్తారు. శాశ్వత నివాస కార్డుని పొందిన వ్యక్తులకు ప్రభుత్వ సంస్థలలో విద్య మరియు ఆరోగ్య సంరక్షణలో కతర్ పౌరులకు మాదిరిగానే ఒకే విధమైన చికిత్సను అందించనున్నారు. ఆ గుర్తింపు కార్డు ద్వారా కొన్ని అధికారాలను కలిగి ఉండొచ్చు. ప్రభుత్వ సైనిక మరియు పౌర ఉద్యోగాలను నిర్వహించడంలో కతర్ పౌరుల తర్వాత ఆ కార్డుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అదనంగా ఈ గుర్తింపు కార్డుదారులు ఆస్తి యాజమాన్యానికి హక్కు మరియు ఒక కతర్ భాగస్వామి కలిగి అవసరం లేకుండా కొన్ని వాణిజ్య వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. క్యాబినెట్ జారీ చేయబడిన ఆ నిబంధనలు ప్రకారం చట్టం శాసనాలకు అనుగుణంగా శాశ్వత రెసిడెన్సీ ఐడిని మంజూరు చేసే అభ్యర్థనలను సమీక్షించేందుకు శాశ్వత రెసిడెన్సీ ఐ డి గ్రాంట్ కమిటీ పేరుతో అంతర్గత వ్యవహారాల శాఖ వద్ద ఒక శాశ్వత కమిటీ ఏర్పాటు చేయబడుతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







