పట్టణాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
- August 06, 2017
పట్టణాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. నగరాలు, పట్టణాల్లో నివాసముంటున్న వారికి కారు, ఫ్రిజ్, ఏసీ ఉన్నాయా ? అయితే సంక్షేమ పథకాలు పొందేందుకు మీరు అర్హులు కాదంటూ కేంద్రం నియమించిన దేబ్రాయ్ కమిటీ బాంబులాంటి వార్త పేల్చింది. నాలుగు గదుల ఇల్లున్నా, కారు లేదా ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ద్విచక్రవాహనం ఉంటే మీకు సర్కారు సంక్షేమ పథకాల ఫలాలు పొందటానికి అర్హులు కాదంటూ బిబేక్ దెబ్రాయ్ కమిటీ సిఫార్సు చేసింది.తాజాగా జరపనున్న సాంఘీక ఆర్థిక సర్వేలో పట్టణ వాసులకు పైన పేర్కొన్న వస్తువులు ఇంట్లో ఉంటే సంక్షేమ పథకాలు అందవని కమిటీ స్పష్టం చేసింది. ఇల్లు లేని వారు, పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది. మొత్తంమీద పట్టణాల్లో నివాసముంటున్న వారిలో 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









