బాలనటిగా అడుగు పెడుతున్న మంచు లక్ష్మి కూతురు

- August 08, 2017 , by Maagulf
బాలనటిగా అడుగు పెడుతున్న మంచు లక్ష్మి కూతురు

మహానటి సావిత్రి జీవిత చరిత్రను వెండి తెరపై నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నాడు. మహానటి పేరుతో రూపొందుతున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ .. సావిత్రి పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తున్నది.. సమంత కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్నది.. దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ గా నటిస్తున్నాడు.. కాగా ఈ సినిమాతో మంచు లక్ష్మి తనయ నిర్వాన వెండి తెరపై బాలనటిగా అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.. తన కూతురు నిర్వాన సావిత్రి సినిమాలో నటిస్తుందని లక్ష్మి ట్విట్టర్ వేదికగా స్వయంగా ప్రకటించింది. 'మహానటి' సినిమాలో చిన్నప్పటి సావిత్రిగా నిర్వాన నటించనున్నది.. ఈ విషయం పై లక్ష్మి స్పందిస్తూ.. తన కూతురు మహానటి జీవిత కధతో తెరకెక్కుతున్న సినిమాలో నటించే అవకాశం దక్కడం గొప్ప అదృష్టం గా భావిస్తున్నట్లు చెప్పింది.. సావిత్రి చిన్నప్పటి పాత్ర ను తన కూతురుకి ఇవ్వమని తన స్నేహితురాలైన స్వప్న , ప్రియాంకలను అడిగినట్లు లక్ష్మి చెప్పింది.. మోహన్ బాబు మూడో తరం వారసత్వం కూడా వెండి తెరపై అడుగు పెడుతున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com