ఖతార్ సంక్షోభంపై కువైట్ కొత్త ప్రతిపాదన
- August 08, 2017
ఖతార్ సంక్షోభం నేపథ్యంలో కువైట్ కొత్త ప్రతిపాదనలో ముందుకొచ్చింది. చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్న కువైట్, ఖతార్‌పై బ్యాన్ విధించిన వివిధ దేశాలతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఖతార్ సంక్షోభం ఎక్కువ కాలం ఉండటం గల్ఫ్ ప్రాంతానికి మంచిది కాదని కువైట్ భావిస్తోంది. కువైట్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఫారిన్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ హమాద్ అల్ సబా మరియు స్టేట్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అలాగే యాక్టింగ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ అల్ అబ్దుల్లా సోమవారం సౌదీ అరేబియా, ఈజిప్ట్‌లకు చెందిన ప్రముఖులతో చర్చించరు. సౌదీ అరేబియాలో జరిగిన చర్చల్లో గల్ఫ్ ప్రాంతంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇంకో వైపున జూన్ నుంచి ఖతార్ సంక్షోభ నివారణకు జరుగుతున్న ప్రయత్నాలేవీ సత్ఫలితాలు ఇవ్వడంలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







