తీవ్రవాదానికి ఖతార్ సాయం: వెలుగు చూసిన చెక్
- August 08, 2017
తీవ్రవాదులకు ఆర్థిక సహాయం అందించేందుకోసం ఖతారీ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన చెక్‌గా చెప్పబడ్తోన్న ఓ ఇమేజ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బహ్రెయిన్‌లోని అల్ వెఫాక్ ఉన్నతాధికారికి ఖతార్ ఇంటెలిజెన్స్ చెల్లించేందుకు వీలుగా చెక్ రూపొందించినట్లుగా ఆ ఇమేజ్ తెలియజేస్తోంది. 1,000 బహ్రెయినీ దినార్స్ విలువైన చెక్ ఇది. మాజీ ఎంపీ హస్సన్ మర్‌జూక్ కోసం ఈ చెక్‌ని జనవరి 23, 2011 డేట్‌తో రూపొందించారు. 2015లో ఈ మాజీ ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రవాదులకు ఆర్థిక సహాయం అందిస్తున్నందుకుగాను ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తీవ్రవాదానికి ఆర్థికంగా అండదండలు అందిస్తున్నదన్న ఆరోపణల నేపథ్యంలో ఖతార్‌పై పలు గల్ఫ్ దేశాలు సహాయ నిరాకరణ చేపట్టిన సంగతి తెలిసినదే. వివిధ తీవ్రవాద సంస్థలకు ఖతార్ ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక అండదండలు అందుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఖతార్ ఖండిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







