షారుక్ సినిమాలో ముగ్గురు సూపర్ స్టార్ లు
- August 10, 2017
షారుక్ ఖాన్‌కి తలైవా రజనీకాంత్ అంటే ఎంతో అభిమానం. అందుకే తాను నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రంలో 'లుంగి డ్యాన్స్'తో తలైవా కోసం ప్రత్యేక పాటను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు షారుక్ నటించనున్న ఓ చిత్రంలో ఏకంగా రజనీకాంతే అతిథి పాత్రలో మెరవనున్నారట.
షారుక్ ఖాన్, కబీర్ ఖాన్ కాంబినేషన్లో రానున్న కొత్త ప్రాజెక్ట్ 'శిద్యాత్'. ఇందులో షారుక్‌కి జోడీగా దీపిక పదుకొణెని ఎంపికచేసుకున్నారట. మరో విషయమేంటంటే.. ఈ చిత్రంలో తలైవాతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అతిథి పాత్రలో కనువిందు చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాదు.. ఇందులో మన 'బాహుబలి' ప్రభాస్ కూడా గెస్ట్ రోల్లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని ఓ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించనున్నారట. అయితే అతిథి పాత్రల గురించి చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో చిత్రీకరణ ప్రారంభం కానుందట. అన్నీ అనుకున్నట్లు కుదిరితే నలుగురు సూపర్స్టార్లను ఒకే తెరపై చూడచ్చు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







