దంగల్‌ కేక్‌ ధర ఎంతో తెలుసా?

- August 11, 2017 , by Maagulf
దంగల్‌ కేక్‌ ధర ఎంతో తెలుసా?

70వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దుబాయ్‌కి చెందినో బ్యాకరీ భారీ కేక్‌ని తయారు చేసింది. దంగల్‌ కాన్సెప్ట్‌తో ఈ కేక్‌ని తయారు చేశారు. 150,00 దిర్హామ్‌లు ఖర్చయ్యింది ఈ కేక్‌ తయారీ కోసం. బ్రాడ్‌వే బేకరీ కేక్‌ ఆర్టిస్టులు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ని అత్యంత జాగ్రత్తగా రూపొందించారు కేక్‌ రూపంలో. 'దంగల్‌' సినిమా సాధించిన విజయం, అలాగే ఈ సినిమా యువతరంలో నింపిన స్ఫూర్తి నేపథ్యంలో ఈ కేక్‌ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 75 గ్రాముల ఎడిబుల్‌ గోల్డ్‌ని వినియోగించారు కేక్‌ కోసం. 3.5 వారాలపాటు, 1,200 మ్యాన్‌ అవర్స్‌తో, డిజైన్‌ చేయించారు ఈ కేక్‌ని. 4 అడుగుల ఎత్తున ఈ కేక్‌ని తయారు చేయడం జరిగింది. మొత్తం బరువు 54 కిలోలు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com