అత్యాధునిక నగరంగా హైదరాబాద్ రూపు దిద్దుకోనుంది - కేటీఆర్
- August 11, 2017
తెలంగాణ రాష్ట్రం వస్తే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని భయపెట్టారని.. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉందని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మూడో వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందినదని అన్నారు. కరెంటు కోతలు లేకుండా చేయడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని.. అలాగే తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో అధిగమిస్తున్నామని కేటీఆర్ ఆన్నారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన రాష్ట్రాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని.. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







