పాకిస్తాన్ ను ఘాటుగా హెచ్చరించిన అమెరికా

- August 11, 2017 , by Maagulf
పాకిస్తాన్ ను ఘాటుగా హెచ్చరించిన అమెరికా

ఉగ్రవాదాన్నిపెంచి పోషిస్తున్న దేశంగా పాకిస్తాన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎవరెంతగా చెప్తున్నా పాపి తీరు మారడం లేదు. భారత బోర్డర్‌ దగ్గర టెర్రర్ కాలనీలు, ఆఫ్గన్ సరిహద్దుల్లో తాలిబాన్ల డెన్‌లు ఉన్నాయి. ఒకప్పుడు బిన్ లాడెన్‌ బతికింది.. పాక్ రాజధాని దగ్గర్లోనే. లష్కరే, జైషే ఉగ్రవాదులు, వారి నేతలు విచ్చలవిడిగా వీధుల్లో తిరుగుతూ పబ్లిక్ మీటింగ్‌లు పెడుతున్నా.. పాక్ పాలకులు కళ్లు తెరవడం లేదు. ఈ మధ్యే పాక్‌కు ఆర్థిక సాయంలో కోత కోసిన అమెరికా .. ఇప్పుడు మరో ఘాటు హెచ్చరిక చేసింది. టెర్రరిజంపై కఠిన చర్యలు తప్పవంటూనే.. పాకిస్తాన్‌పైనా యాక్షన్‌ ఉంటుందని సంకేతాలిచ్చింది.

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లపై యుద్ధం చేసిన అమెరికా.. ఆదేశ పునర్నిర్మాణంపై కీలక సమీక్ష జరుపుతోంది. మరోసారి ఉగ్రవాదుల స్థావరం కాకుండా, అమెరికాపై దాడులు జరక్కుండా నిరోధించడం రివ్యూ ప్రధాన ఉ్దదేశం. ఆ వ్యూహంలో భారత్, పాక్‌ను చేర్చుతామని ప్రకటించింది. ప్రాంతీయ పరిష్కారం కోసం ప్రయత్నమని వైట్‌హౌస్ వర్గాలు స్పష్టంచేశాయి.
ఆప్గన్ పునర్నిర్మాణంలో భారత్‌ కీలకపాత్ర పోషిస్తోంది. అక్కడి పార్లమెంట్ భవనాన్ని నిర్మించడం దగ్గర్నుంచి మౌలిక వసతుల కల్పనకు నిధులు అందిస్తోంది. అయితే.. తాలిబాన్ల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. లాడెన్ హతమైనా.. అల్‌ఖైదా కదలికలు కలవరం కలిగిస్తున్నాయి. పాక్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల్లో డెన్లు ఏర్పాటు చేసుకున్న తాలిబాన్లపై అమెరికా డ్రోన్లు దాడులు చేస్తున్నా.. పాకిస్తాన్ నుంచి సహకారం అందట్లేదు. ఇటు... భారత్ సరిహద్దుల్లోను ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ.. అరాచకాలకు అడ్డాగా మారింది. ప్రపంచ వేదికలపై పాపి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్న భారత్‌కు.. ఆఫ్గన్ రివ్యూ రూపంలో మరో సపోర్ట్‌ లభించిందనే చెప్పాలి. యాక్షన్ తప్పదంటూ అమెరికా చెప్పడం పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com