ఈజిప్టులో రైలు ప్రమాదం 44 మంది మృతి
- August 12, 2017
ఈజిప్టు రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరుకుంది. అలెగ్జాండ్రియాలో రెండు రైళ్లు ఢకొీన్న ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. మరో 180 మంది గాయపడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటన శుక్రవారం జరిగింది. స్థానిక కెనాల్ సిటీ నుంచి బయల్దేరిన ఓ రైలు ఖోర్షిద్ ప్రాంతంలోని చిన్న రైల్వేస్టేషన్ వద్ద ఆగింది. ఇంతలో కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న మరో రైలు.. ఆగి ఉన్న రైలును వెనుక నుంచి ఢకొీట్టింది. రైలు వేగంగా ఢకొీట్టడంతో బోగీలు నుజునుజ్జు అయ్యాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







