దోసకాయ చికెన్‌

- August 12, 2017 , by Maagulf
దోసకాయ చికెన్‌

కావలసినవి:
చికెన్‌: పావుకిలో, ఉల్లిపాయ: ఒకటి, నిమ్మరసం: టీస్పూను, కారం: టీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, అల్లంవెల్లుల్లి: టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, జీలకర్ర: చిటికెడు, గోంగూర కట్టలు: 4(సన్నవి), పచ్చిమిర్చి: మూడు, నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా, ఉప్పు: తగినంత 

 

తయారుచేసే విధానం: 
* చికెన్‌ ముక్కలకు నిమ్మరసం, ఉల్లిముద్ద, టీస్పూను నెయ్యి, కారం, ఉప్పు, దనియాలపొడి, గరంమసాలా, అల్లంవెల్లుల్లి అన్నీ పట్టించి పది నిమిషాలు నాననివ్వాలి. 
* పాన్‌లో టీస్పూను నూనె వేసి గోంగూర ఆకులు వేసి వేయించి చల్లారనివ్వాలి. తరవాత వీటికి పచ్చిమిర్చి చేర్చి కచ్చాపచ్చాగా రుబ్బాలి. 
* చికెన్‌లో కొద్దిగా నీళ్లు చిలకరించి ఉడికించాలి. 
* మరో పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసి కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఉడికించిన చికెన్‌ ముక్కలు, గరంమసాలా వేసి తడి లేకుండా వేయించాలి. చివరగా గోంగూర ముద్ద వేసి బాగా వేయించి దించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com