నేపాల్‌లో భారీ వరదలు, 36 మంది దుర్మరణం
- August 12, 2017
నేపాల్‌లో భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడడంతో ఇప్పటివరకు 36 మంది దుర్మరణం చెందగా, 12 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వరదలకు వందలాది ఇళ్లు నీట మునగగా..వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆ దేశ హోంశాఖ పేర్కొంది.
మరోవైపు ప్రధాని షేర్ బహదూర్ దేవ్ నేతృత్వంలో అత్యవసరంగా సమావేశమైన కేబినెట్ సహాయక చర్యల్ని మరింత ఉధృతం చేయాలని స్థానిక, జిల్లా అధికారులను ఆదేశించింది. ఝపా, మోరంగ్, సున్సారీ, సప్టారీ, సిరాహా, సర్లాహీ, రౌతహట్, బంకే, బర్దియా, దంగ్ జిల్లాలు వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నట్లు హోంమంత్రి శర్మ వెల్లడించారు. వరద నీరు చొచ్చుకురావడంతో బిరత్‌నగర్ విమానాశ్రయాన్ని మూసివేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







